Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సగం మునిగాం... నిలువునా ముంచొద్దు!: కృష్ణలో దిగి నటుడు శివాజీ వినూత్న నిరసన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ, సినీ నటుడు శివాజీ వినూత్న నిరసన తెలుపుతున్నారు. విజయవాడలోని దుర్గా ఘాట్ వద్ద కృష్ణా నదిలో నీటిలోకి దిగారు. రాష్ట్ర విభజనతో సగం మునిగి ఉన్న తమను ప్రత్యేక హోదా ఇవ్వకుండా చేసి నిలువునా ముంచొద్దని అన్నారు. 'మాట తప్పొద్దు... ఏపీని ముంచొద్దు' అని రాసిన ప్లకార్డును ఆయన పట్టుకున్నారు. శివాజీని చూసేందుకు అభిమానులు రావడంతో, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.

More Telugu News